హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
ఢిల్లీలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న వారిని కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. నిరసనకారులను నిలువరించేందుకు రైళ్లు, మెట్రో సర్వీసులు రద్దు చేశారని, పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని మండిపడ్డారు.
